WhatsApp ఇతర Facebook కంపెనీలతో ఏ విధమైన సమాచారాన్ని షేర్ చేస్తుంది?
WhatsApp ప్రస్తుతం నిర్దిష్ట కేటగిరీల సమాచారాన్ని Facebook కంపెనీలతో షేర్ చేస్తోంది. మేము ఇతరFacebook కంపెనీలతో షేర్ చేసే సమాచారంలో, మీ అకౌంట్ నమోదు సమాచారం (మీ ఫోన్ నంబర్ లాంటి), లావాదేవీ డేటా (ఉదాహరణకు, మీరు WhatsAppలో Facebook Pay లేదా Shopsను ఉపయోగిస్తే), సేవా-సంబంధిత సమాచారం, మా సేవలను ఉపయోగించేటప్పుడు మీరు బిజినెస్‌లతో ఎలా ఇంటరాక్ట్ అవుతారనే దానిపై సమాచారం, మొబైల్ డివైజ్ సమాచారం, మీ IP అడ్రస్, అలాగే గోప్యతా విధానంలోని 'మేము సేకరించే సమాచారం' అనే పేరుతో గల విభాగంలో గుర్తించబడిన ఇతర సమాచారం లాంటివి చేర్చబడవచ్చు, లేదా మీ సమ్మతి ఆధారంగా మీకు తెలియచేసి సేకరించే సమాచారం ఉండవచ్చు.
ముఖ్యమైన మార్గాల్లో మేము Facebookతో షేర్ చేసే సమాచారానికి పరిమితి విధించాము. ఉదాహరణకు, మేము ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సంరక్షిస్తాము, కాబట్టి WhatsApp లేదా Facebook కానీ ఈ ప్రైవేట్ (వ్యక్తిగత) మెసేజ్‌లను చూడటం సాధ్యపడదు. మేము ప్రతి ఒక్కరి మెసేజ్‌లు, కాల్స్ వివరాలు మా వద్ద ఉంచుకోము కాబట్టి మీరు షేర్ చేసిన లొకేషన్‌ను మేము చూడలేము, దీని వల్ల మేము దీనిని Facebookతో షేర్ చేయడం సాధ్యపడదు, షేర్ చేయము కూడా. సేవనందించేందుకు మాకు మీ కాంటాక్టుల వివరాలు అవసరం, కానీ మేము మీ కాంటాక్టులను Facebookతో షేర్ చేయము. ఈ పరిమితుల గురించి మీరు మరింత ఇక్కడ తెలుసుకోవచ్చు.