మేము మా సేవా నిబంధనలు, గోప్యతా విధానాన్ని అప్డేట్ చేస్తున్నాం
WhatsAppలో బిజినెస్‌లు, వాటి కస్టమర్లకు మధ్య జరిగే మెసేజ్‌లకు సంబంధించిన సేవా నిబంధనలు, గోప్యతా విధానాలకు మేము మార్పులు చేస్తున్నాము. మేము డేటాను ఎలా సేకరిస్తాం, షేర్ చేస్తాం, వినియోగిస్తాం అనే దాని గురించి కూడా మరింత సమాచారాన్ని అందిస్తున్నాము.
మీ గోప్యతకు సంబంధించి మా అంకితభావంలో ఎటువంటి మార్పు లేదు. మీ వ్యక్తిగత సంభాషణలు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి, అంటే మీ చాట్స్ బయటి వారు, చివరకు WhatsApp లేదా Facebook వాటిని చదవడం లేదా వినడం చేయడం సాధ్యపడదు అని దాని అర్థం.
ఈ అప్డేట్స్ గురించి స్పష్టంగా వివరించడమనేది మా బాధ్యత. మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఇస్తున్నాం:
ఏది మార్చబడుతోంది

ఫోన్ కాల్ లేదా ఇమెయిల్‌తో పోలిస్తే మరింత వేగంగా పనులను చక్కబెట్టుకోవడానికి మీరు WhatsAppలోని మరిన్ని బిజినెస్‌లతో మాట్లాడగలుగుతారు. ఇది పూర్తిగా ఆప్షనల్.
ప్రతి రోజు, చిన్నా పెద్ద బిజినెస్‌లతో కమ్యూనికేట్ చేయడానికి లక్షలాది మంది వ్యక్తులు WhatsApp ఉపయోగిస్తారు. మీరు ప్రశ్నలు అడిగేందుకు, కొనుగోళ్లు చేసేందుకు, సమాచారాన్ని పొందేందుకు బిజినెస్‌లకు మీరు మెసేజ్ చేయవచ్చు. WhatsAppలో ఒక బిజినెస్‌తో చాట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం, మీరు వాటిని బ్లాక్ చేయవచ్చు లేదా మీ కాంటాక్ట్స్ జాబితా నుండి తీసివేయవచ్చు.
విమానయాన సంస్థలు లేదా రిటైలర్స్ లాంటి పెద్ద బిజినెస్‌లు - విమానాల వివరాలు లేదా తమ ఆర్డరును ట్రాక్ చేయడానికి సంబంధించిన సమాచారం కోసం, ఒకేసారి వేలాది మంది నుండి మెసేజ్‌లు అందుకుంటూ ఉంటాయి. వారికి త్వరగా ప్రతిస్పందించగలిగేలా నిర్ధారించుకోవడానికి, ఈ బిజినెస్‌లు, తమ తరఫున కొన్ని ప్రతిస్పందనలను మేనేజ్ చేయడం కోసం Facebookను ఒక టెక్నాలజీ ప్రొవైడర్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాంటి సమయంలో మీకు తెలియపరచడం కోసం మేము చాట్స్‌ను స్పష్టంగా లేబుల్ చేస్తాము.

మేము డేటాను ఎలా సేకరిస్తాం, షేర్ చేస్తాం, వినియోగిస్తాం అనే దాని గురించి మరింత స్పష్టతను అందిస్తున్నాము.
మేము మీ సమాచారాన్ని ఎలా నిర్వహిస్తామనే దానికి సంబంధించి మరింత వివరణాత్మకమైన సమాచారాన్ని మా గోప్యతా విధానానికి చేసే మార్పులు అందిస్తాయి. మా గోప్యతా విధానంలోని నిర్దిష్ట విభాగాలలో మరిన్ని వివరాలను యాడ్ చేశాము, అలాగే కొత్త విభాగాలు కూడా యాడ్ చేశాము. గోప్యతా విధానపు లేఅవుట్‌ను కూడా మేము సరళీకరించి వినియోగదారులు మరింత సులభంగా నేవిగేట్ చేయగలిగేలా తీర్చిద్దాము.
మీరు మీ WhatsApp అకౌంట్ సమాచార నివేదికను, సెట్టింగ్స్‌ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏది మార్చబడటం లేదు

కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీరు జరుపుకునే వ్యక్తిగత సంభాషణల గోప్యత, భద్రతకు ఎటువంటి మార్పు చేయడం లేదు.
మీ కుటుంబం, స్నేహితులతో మీరు చేసుకునే వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్, మీరు షేర్ చేసే అటాచ్మెంట్లు, లేదా మీరు పంపే లొకేషన్ లాంటి మీ కంటెంట్‌ను WhatsApp కానీ Facebook కానీ చూడటం సాధ్యపడదు. ఎవరు ఎవరికి మెసేజ్ మెసేజ్ చేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారు లాంటి వివరాలను మేము ఉంచుకోము, అలాగే WhatsApp మీ కాంటాక్టులను Facebookతో షేర్ చేయదు.

మీరు నియంత్రించవచ్చు. ఒక బిజినెస్‌తో మీరు నంబరును షేర్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం, సదరు బిజినెస్‌ను మీరు ఏ సమయంలో అయినా బ్లాక్ చేయవచ్చు.
బిజినెస్‌లకు WhatsApp మీ నంబరును ఇవ్వదు, అలాగే తొలిసారి మీ ఆమోదం లేకుండా బిజినెస్‌లు WhatsAppలో మిమ్మల్ని సంప్రదించడంపై మా విధానాలు నిషేధం విధించాయి.
మీ మెసేజ్‌లను అదృశ్యమయ్యేలా సెట్ చేయడం లేదా ఎవరు మిమ్మల్ని గ్రూపులకు యాడ్ చేయవచ్చు లాంటి మా అదనపు గోప్యతా ఫీచర్లు మీ గోప్యతకు సంబంధించి మరొక అదనపు రక్షణ కవచాన్ని అందిస్తాయి.

మీరు కొత్త సేవా నిబంధనలకు ఒప్పుకోవడం వలన Whatsapp, తన పేరంట్ కంపెని అయిన Facebookకి వినియోగదారుని డేటాని షేర్ చేసే సామర్థ్యాన్ని విస్తరించడం జరగదు.
మరింత సమాచారం కోసం, దయచేసి మా నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని రివ్యూ చేయండి. అలాగే తరచూ అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలను ఇక్కడ చూడవచ్చు.