బిజినెస్ ఫీచర్‌ల సమాచారం
ఇటీవలి నిబంధనలు అలాగే గోప్యతా విధానానికి సంబంధించిన అప్‌డేట్ వల్ల వ్యక్తిగత మెసేజ్‌లు ప్రభావితం కాబోవని మేము స్పష్టం చేయదలచుకున్నాము. ఆ మార్పులనేవి WhatsAppలో ఐచ్చిక (ఆప్షనల్) బిజినెస్ ఫీచర్లకు సంబంధించినవి, అవి మేము డేటాను ఎలా సేకరిస్తాం, ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత పారదర్శకతను అందిస్తాయి.

ఏ మార్పులు జరగడం లేదు?
మీ వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ యొక్క గోప్యత మరియు భద్రతలో ఎటువంటి మార్పు ఉండదు. అవి సంపూర్ణంగా గుప్తీకరించబడి ఉంటాయి, WhatsApp మరియు Facebook వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు. మేము ఈ భద్రతను ఎప్పటికీ బలహీనపరచబోము, ప్రతీ చాట్‌ను మేము లేబుల్ చేస్తాం కాబట్టి మీరు మా అంకితభావాన్ని తెలుసుకోవచ్చు.
ఆప్షనల్ బిజినెస్ ఫీచర్‌లు
ప్రతి రోజూ బిజినెస్ అకౌంట్‌కు మెసేజ్‌లు పంపే 175 మిలియన్లకు పైగా ప్రజలకు మరింత మెరుగైన సపోర్ట్ అందించేందుకు మేము పనిచేస్తున్నాము. ఒక బిజినెస్‌తో జరిపే కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికీ భద్రంగా, మరింత మెరుగ్గా అలాగే మరింత సులభంగా ఉండాలని మేము విస్తృతంగా చేస్తున్న కృషిలో ఆప్షనల్ బిజినెస్ ఫీచర్లకు సంబంధించిన అప్‌డేట్స్ అనేవి ఒక భాగం. ఈ ప్రయత్నాల్లో ఇవి ఉంటాయి:
- కస్టమర్ సర్వీస్‌ను ప్రారంభించడం: బిజినెస్ సంస్థలను ప్రశ్నలు అడిగేందుకు, కొనుగోలు చేయడానికి, లేదా కొనుగోలు రసీదుల వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని పొందడానికి చాట్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు తెలుసుకున్నారు. Facebook బిజినెస్ ప్రోడక్ట్‌లను ఉపయోగించే బిజినెస్‌లతో చాట్ చేయడాన్ని మేము మరింత సులభం చేస్తున్నాము. కస్టమర్ల అవసరాలకు స్పందించడానికి, కొన్ని బిజినెస్‌లకు సురక్షితమైన హోస్టింగ్ సర్వీస్ అవసరం, వాటినే Facebook అందించడానికి ప్రణాళిక రచిస్తోంది. ఒక బిజినెస్ ఈ సర్వీసును ఉపయోగించేటప్పుడు, ఆ చాట్‌ను మేము స్పష్టంగా లేబుల్ చేస్తాం, కాబట్టి వారికి మెసేజ్ పంపాలా వద్దా అనేది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
- బిజినెస్‌ను వెతకడం: WhatsAppను ఉపయోగించి బిజినెస్‌లకు బటన్‌ల ద్వారా మెసెజే చేయగలిగే సౌలభ్యం ఉన్న యాడ్‌లను మీరు Facebook లేదా Instagramలలో ఆల్రెడీ చూడవచ్చు. Facebookలోని ఇతర యాడ్స్ మాదిరిగానే, మీరు ఈ యాడ్స్‌పై క్లిక్ చేయడానికి ఎంచుకుంటే, మీరు Facebookలో చూసే యాడ్స్‌ని వ్యక్తిగతీకరించడానికి ఈ క్లిక్ ఉపయోగించబడవచ్చు. మళ్లీ స్పష్టం చేస్తున్నాం, సంపూర్ణంగా గుప్తీకరించిన ఏ విధమైన మెసేజ్‌లలోని కంటెంట్‌ను చూడటం WhatsApp మరియు Facebookకు సాధ్యపడదు.
- షాపింగ్ అనుభవాలు: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. Facebook లేదా Instagramలో Shop కలిగిన ఉన్న బిజినెస్‌లు, వాటి WhatsApp బిజినెస్ ప్రొఫైల్‌లో ఆల్రెడీ Shopలను కలిగి ఉన్నాయి. దీని వల్ల మీరు ఒక బిజినెస్ యొక్క ప్రోడక్టులను Facebook, Instagramలో చూడగలుగుతారు, వాటిని నేరుగా WhatsApp నుండే కొనుగోలు చేయగల సదుపాయం మీకు లభిస్తుంది. మీరు Shopsతో ఇంటరాక్ట్ అవ్వదలచుకుంటే, మేము మీ డేటా Facebookతో ఎలా షేర్ చేయబడుతుందనే వివరాలను WhatsAppలో మీకు తెలియచేస్తాము.
ఈ ఆప్షన్ల గురించి, అలాగే మేము Facebookతో కలిసి ఎలా పనిచేస్తామనే దాని గురించి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు ఇక్కడ.