WhatsApp గోప్యతా విధానం గురించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం

మేము ఇటీవలే మా గోప్యతా విధానాన్ని అప్‌డేట్ చేశాము, ఈ సందర్భంగా మేము పలు ఆలోచనాత్మక ప్రశ్నలను అందుకున్నాము. ఇందుకు సంబంధించి కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్న కారణంగా, మేము అందుకున్న కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వదలచుకున్నాము. ప్రజలు ప్రైవేటుగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సహాయపడేలా WhatsAppను రూపొందించడానికి మేము తీసుకోవలసిన చర్యలన్నీ చాలా లోతుగా తీసుకుంటాము.
ఈ గోప్యతా విధానానికిి సంబంధించిన అప్‌డేట్ వల్ల, మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఇచ్చి పుచ్చుకునే మెసేజుల గోప్యతకు ఏ రకంగానూ భంగం వాటిల్లదు అని మేము ఈ సందర్భంగా మీకు స్పష్టం చేయదలచుకున్నాము. ఈ మార్పులనేవి WhatsAppలో ఐచ్చికమైన (ఆప్షనల్) బిజినెస్ ఫీచర్లకు సంబంధించినవి, అవి మేము డేటాను ఎలా సేకరిస్తాము, ఎలా దానిని వినియోగిస్తామనే దాని గురించి మరింత పారదర్శకతను అందిస్తాయి. కొత్త బిజినెస్ ఫీచర్లు, WhatsApp యొక్క గోప్యతా విధానం అప్‌డేట్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి .
మీ వ్యక్తిగత మెసేజింగ్ యొక్క గోప్యత మరియు భద్రత
మేము మీ వ్యక్తిగత మెసేజ్‌లను చూడటం లేదా మీ కాల్స్‌ను వినడం సాధ్యపడదు, Facebookకు కూడా అది సాధ్యం కాదు: WhatsAppకు కానీ Facebookకు కానీ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు మీరు WhatsAppలో పంపే మెసేజ్‌లను చదవడం లేదా చేసే కాల్స్‌ను వినడం కానీ సాధ్యపడదు. మీరు షేర్ చేసుకునేది ఏదయినా, మీ మధ్యే ఉంటుంది. మీ వ్యక్తిగత మెసేజులను సంపూర్ణంగా గుప్తీకరించడమే దానికి కారణం. మేము ఈ భద్రతను ఎప్పటికీ బలహీనపరచబోము, అలాగే ప్రతీ చాట్‌ను స్పష్టంగా లేబుల్ చేస్తాము, దీనిని బట్టి మీరు మా నిబద్ధతను తెలుసుకోవచ్చు. WhatsApp భద్రత గురించి మరింత తెలుసుకోండి ఇక్కడ.
ఎవరు మెసేజ్ చేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారనే వివరాలను మేము ఉంచుకోము: సంప్రదాయకంగా మొబైల్ క్యారియర్లు, ఆపరేటర్లు ఈ సమాచారాన్ని స్టోర్ చేస్తారు, రెండు బిలియన్ల వినియోగదారులకు చెందిన ఈ రికార్డులను ఉంచుకోవడమనేది గోప్యతాపరమైన, భద్రతాపరమైన ప్రమాదాలకు కారణమవుతుంది, కాబట్టి ఇలాంటి పనులను మేము చేయము.
మేము కానీ, Facebook కానీ మీరు షేర్ చేసుకునే లొకేషన్‌ను చూడటం సాధ్యపడదు: మీరు WhatsAppలో ఎవరితో అయినా మీ లొకేషన్‌ను షేర్ చేసేటప్పుడు, మీ లొకేషన్ వివరాలు సంపూర్ణంగా గుప్తీకరించబడి సంరక్షించబడతాయి, అంటే మీరు లొకేషన్ ఎవరికైతే షేర్ చేసారో వారు తప్పించి మిగిలిన ఎవరూ దానిని చూడలేరు అని దీని అర్థం.
మేము మీ కాంటాక్టులను Facebookతో షేర్ చేయము: మీరు మాకు అనుమతి ఇచ్చినప్పుడు, మెసేజింగ్‌ను వేగవంతం చేయడానికి అలాగే నమ్మకపాత్రమైనదిగా చేయడానికి మేము కేవలం మీ అడ్రస్ బుక్ నుండి ఫోన్ నంబర్లను మాత్రమే యాక్సెస్ చేస్తాము, మీ కాంటాక్టుల లిస్టును Facebook అందించే ఇతర యాప్‌లతో మేము షేర్ చేయము.
గ్రూపులు ప్రైవేటుగానే ఉంటాయి: మెసేజులను డెలివర్ చేయడానికి, మా సర్వీసును స్పామ్ మరియు దుర్వినియోగం బారి నుండి కాపాడుకోవడానికి మేము గ్రూప్ మెంబర్‌షిప్ ఉపయోగిస్తాము. యాడ్స్ ప్రయోజనాల కోసం మేము ఈ డేటాను Facebookతో షేర్ చేయము. మళ్లీ స్పష్టం చేస్తున్నాం, ఈ వ్యక్తిగత మెసేజ్‌లు సంపూర్ణంగా గుప్తీకరించబడి ఉంటాయి, కాబట్టి మేము ఆ కంటెంట్‌ను చూడటం సాధ్యపడదు.
మీ మెసేజులు అదృశ్యమయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు: అదనపు గోప్యత కోసం, మీరు మెసేజులను పంపిన తర్వాత అవి అదృశ్యమయ్యేలా చేసే సెట్టింగును ఎంచుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.
మీరు మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: మీ ఖాతా గురించి మా వద్ద ఏ సమాచారం ఉందనేది మీరు యాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.
బిజినెస్ మెసేజింగ్ మరియు Facebookతో మేము ఎలా పనిచేస్తాము
ప్రతీ రోజు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వ్యక్తులు, అన్ని స్థాయిల బిజినెస్ సంస్థలతో WhatsAppలో సురక్షితంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. బిజినెస్ సంస్థలకు మీరు మెసేజులు పంపాలని అనుకుంటే, మేము దానిని మరింత సులభంగా అలాగే మరింత మెరుగ్గా చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఈ ఫీచర్లు ఉపయోగించే ఏ బిజినెస్ సంస్థతో అయినా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు WhatsAppలో మేము ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటాము.
Facebook హోస్టింగ్ సర్వీసులు: బిజినెస్‌లకు మెసేజ్ చేయడమనేది, మీ కుటుంబం లేదా స్నేహితులకు పంపే మెసేజింగ్‌కు భిన్నంగా ఉంటుంది. తమ కమ్యూనికేషన్‌ను మేనేజ్ చేసుకోవడానికి కొన్ని పెద్ద బిజినెస్ సంస్థలు హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించుకోవలసి ఉంటుంది. అందుకోసమే మేము, బిజినెస్ సంస్థలు, తమ కస్టమర్లతో జరిపే WhatsApp చాట్స్‌ను మేనేజ్ చేయడానికి, ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి, కొనుగోలు రసీదులు పంపడం లాంటి సహాయకరమైన సమాచారాన్ని పంపించడానికి Facebook నుండి సురక్షితమైన హోస్టింగ్ సర్వీసులు ఉపయోగించుకునే ఆప్షన్‌ను బిజినెస్ సంస్థలకు అందిస్తున్నాము. కానీ మీరు ఒక బిజినెస్ సంస్థతో ఫోన్, ఇమెయిల్, లేదా WhatsApp ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు, మీరు ఏమి చెబుతున్నారనే దానిని ఆ బిజినెస్ సంస్థ చూడగలుగుతుంది మరియు ఆ సంస్థ యొక్క సొంత వ్యాపార ప్రయోజనాల కోసం, ఆ సంస్థ ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో భాగంగా, Facebookలో వ్యాపార ప్రకటనలు ఇవ్వడం వంటివి కూడా ఉండవచ్చు. మీకు సమాచారం అందుతోందని నిర్ధారించుకోవడానికి, Facebook నుండి హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి ఎంచుకున్న బిజినెస్ సంస్థలతో జరిపే సంభాషణలను మేము స్పష్టంగా లేబుల్ చేస్తాము.
ఒక బిజినెస్ సంస్థను కనుగొనడం: WhatsAppను ఉపయోగించి ఒక బిజినెస్ సంస్థకు మెసేజ్ పంపడానికి Facebookలో ఒక బటన్‌తో మీరు ఒక యాడ్‌ను చూడవచ్చు. మీ ఫోన్లో WhatsApp ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఆ బిజినెస్ సంస్థకు మెసేజ్ పంపే ఆప్షన్ ఉంటుంది మీకు. మీరు Facebookలో చూసే యాడ్లను వ్యక్తిగతీకరించడానికి, ఈ యాడ్లతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని Facebook ఉపయోగించవచ్చు.
WhatsAppలో Payments: WhatsApp యొక్క UPI ప్రారంభించిన paymentsకు ప్రత్యేక గోప్యతా విధానం ఉంది, అది మీ యాక్సెస్‌ను నియంత్రిస్తుంది here, ఆ గోప్యతా విధానంపై ఈ అప్‌డేట్ ప్రభావితం చూపదు.
ఇది సహాయకరంగా ఉందా?
అవును
కాదు