Facebook కంపెనీలతో మేము ఎలా పనిచేస్తాము

This article has been archived. Please see up-to-date content in our Privacy Policy.
ఈ సమాచార కథనంలో మేము యూరోప్ ప్రాంతంలోని మా వినియోగదారులకు అదనపు సమాచారాన్ని అందిస్తున్నాం.
Facebook కంపెనీలు అంటే ఏమిటి?
WhatsApp అనేది Facebook కంపెనీలలో ఒకటి. Facebook కంపెనీలలో, Facebook, Facebook Technologies, WhatsApp ఉన్నాయి, ఇవిన్నీ కలిసి Facebook Company ప్రోడక్ట్‌లను అందిస్తున్నాయి.
Facebook కంపెనీలతో WhatsApp సమాచారాన్ని ఎందుకు షేర్ చేస్తుంది?
WhatsAppను అందించడానికి, మెరుగుపరచడానికి అలాగే WhatsApp ఇంకా ఇతర Facebook కంపెనీలను సురక్షితంగా మరియు భద్రంగా ఉంచడానికి మాకు సహాయపడే మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు సిస్టమ్స్ వంటి సేవలను అందుకోవడానికి WhatsApp ఇతర Facebook కంపెనీలతో పనిచేస్తూ, సమాచారాన్ని షేర్ చేసుకుంటుంది. మేము Facebook కంపెనీల నుండి సర్వీసులను పొందేటప్పుడు, మేము వారితో షేర్ చేసే సమాచారాన్ని మా సూచనల మేరకు WhatsAppకు సహాయపడేందుకు ఉపయోగిస్తారు. మేము కలిసి పనిచేయడం వలన కలిగే ప్రయోజనాలకు ఏమిటంటే:
  • మీకు ప్రపంచ వ్యాప్తంగా వేగవంతమైన, నమ్మకపాత్రమైన మెసేజింగ్, కాల్స్‌ను అందించడం మరియు మా సర్వీసులు, ఫీచర్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడం.
  • స్పామ్ అకౌంట్‌లను తొలగించి, దుర్వినియోగ యాక్టివిటీతో పోరాడటం ద్వారా WhatsApp, Facebook కంపెనీ ప్రోడక్ట్‌ల అంతటా సురక్షితమైన, భద్రతను, సమగ్రతను అందిస్తున్నామని నిర్దారణ కలిగి ఉండడం.
  • మీ WhatsApp అనుభవాన్ని Facebook కంపెనీల ప్రోడక్ట్‌లతో అనుసంధానించడం.
ఈరోజు, Facebook ప్రోడక్ట్ అనుభవాలను మెరుగుపరచడానికి లేదా మరింత అనుగుణమైన Facebook అనుభవాలను Facebookలో అందించడానికి, Facebook మీ WhatsApp అకౌంట్ సమాచారాన్ని ఉపయోగించదు. మీ WhatsApp వినియోగ అనుభవాన్ని, మీరు ఉపయోగించే ఇతర Facebook ప్రోడక్ట్‌లను మరింత మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ కొత్త విధానాలపై పని చేస్తూ ఉంటాము. మేము అందించే కొత్త అనుభవాల గురించి, మా డేటా పద్ధతుల గురించి మీకు తెలియజేస్తూ ఉంటాము.
WhatsApp ఇతర Facebook కంపెనీలతో ఏ విధమైన సమాచారాన్ని షేర్ చేస్తుంది?
Facebook కంపెనీల నుండి సర్వీసులను పొందడం కోసం, గోప్యతా విధానంలోని “మేము సేకరించే సమాచారం” విభాగంలో వివరించిన విధంగా, మీ గురించి మా వద్ద ఉన్న సమాచారాన్ని WhatsApp షేర్ చేస్తుంది. ఉదాహరణకు, విశ్లేషణ సర్వీసులతో WhatsAppని అందించడానికి, Facebook, మీరు WhatsApp కోసం సైనప్ చేసినప్పుడు మీరు వెరిఫై చేసిన ఫోన్ నంబరును, మీ డివైజ్‌కు చెందిన కొంత సమాచారం (అదే డివైజ్‌కు సంబంధించిన అకౌంట్, ఆపరేటింగ్ సిస్టమ్, యాప్ వెర్షన్, ప్లాట్‌ఫాం సమాచారం, మీ మొబైల్ దేశపు కోడ్, నెట్‌వర్క్ కోడ్ లాంటి మీ డివైజ్ ఐడెంటిఫయర్స్, అప్‌డేట్ ఆమోదం, నియంత్రణ ఎంపికల ట్రాకింగ్‌ను ప్రారంభించడాన్ని ఫ్లాగ్ చేయడం), మీ వినియోగ సమాచారంలోని కొంత భాగాన్ని (మీరు WhatsAppను చివరిగా ఎప్పుడు ఉపయోగించారు, మీరు మీ అకౌంట్‌ను తొలిసారిగా నమోదు చేసుకున్న తేదీ, మీరు తరచుగా ఉపయోగించే ఫీచర్ల రకాలను) మా సూచనలకు అనుగుణంగా WhatsApp తరఫున ప్రోసెస్ చేస్తుంది.
అలాగే, Facebook కంపెనీల అంతటా రక్షణ, భద్రత, సమగ్రతను ప్రచారం చేసేందుకు, WhatsApp, అవసరమైన సందర్భాల్లో సమాచారాన్ని ఇతర Facebook కంపెనీలతో షేర్ చేస్తుంది. ఒక నిర్దిష్ట WhatsApp వినియోగదారు ఇతర Facebook కంపెనీల ప్రోడక్ట్‌లను కూడా ఉపయోగిస్తున్నారా అనే దానిని Facebook, ఇతర Facebook కంపెనీలు గుర్తించగలిగేలా, సదరు వినియోగదారుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలా లేక వారిని సంరక్షించాలా అనే దానిని ఇతర Facebook కంపెనీలు అంచనా వేయడానికి షేర్ చేసే సమాచారం ఇందులో ఉంటుంది. ఉదాహరణకు, గుర్తించిన స్పామర్‌కు వ్యతిరేకంగా Facebookలో చర్యలు తీసుకునేలా సహాయపడేందుకు, WhatsApp, అవసరమైన సమాచారాన్ని Facebookకు షేర్ చేయవచ్చు. అంటే, సంఘటన(ల)కు సంబంధించిన సమాచారం, అలాగే WhatsAppకి సైనప్ చేసేటప్పుడు వారు వెరిఫై చేసిన ఫోన్ నంబర్ లేదా అదే డివైజ్ లేదా అకౌంట్‌తో సంబంధం కలిగిన ఐడెంటిఫయర్ల వంటివి. ఏ బదిలీ అయినా, గోప్యతా విధానం విభాగంలోని “డేటాను ప్రోసెస్ చేయడం కోసం మా చట్టపరమైన ప్రాతిపదిక”కు అనుగుణంగా నిర్వహించబడుతుంది.
నా WhatsApp సమాచారాన్ని Facebook కంపెనీలు ఏ విధంగా ఉపయోగిస్తాయి?
  • మా బిజినెస్‌ను నిర్వహించి, మెరుగుపరిచి, అభివృద్ధి చేసేందుకు WhatsAppకు సహాయపడే సర్వీసులను అందుకునేందుకు. WhatsApp, Facebook కంపెనీలకు ఈ విధానాల్లో సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, Facebook కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తాయి, అలాగే మేము వాటితో షేర్ చేసే సమాచారం మా సూచనలకు అనుగుణంగా WhatsAppకు సహాయపడటానికి ఉపయోగించబడుతుంది.
    • మేము సర్వీస్ ప్రొవైడర్లుగా ఇతర Facebook కంపెనీలతో సమాచారాన్ని షేర్ చేస్తాము. మేము మా వినియోగదారులకు WhatsApp సర్వీస్‌ను అందించడానికి, మెరుగుపరచడానికి, సర్వీస్ ప్రొవైడర్లు, WhatsApp లాంటి కంపెనీలకు మౌళిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాలు, సిస్టమ్స్, టూల్స్, సమాచారం, నైపుణ్యాలను అందించి సహాయపడతాయి.
    • ఉదాహరణకు, మా సర్వీసులు ఎలా ఉపయోగించబడుతున్నాయి, Facebook కంపెనీల అంతటా వినియోగాన్ని ఎలా సరిపోల్చుతుందనే దానిని అర్థం చేసుకునేలా ఇది మాకు సహాయపడుతుంది. మీరు WhatsApp కోసం సైనప్ చేసినప్పుడు మీరు వెరిఫై చేసిన ఫోన్ నంబర్, మీ అకౌంట్ చివరిసారిగా ఉపయోగించిన సమయం లాంటి సమాచారాన్ని ఇతర Facebook కంపెనీలకు షేర్ చేయడం ద్వారా, ఒక నిర్దిష్ట WhatsApp అకౌంట్ ఫలానా వ్యక్తికి చెందినది అని, ఆ వ్యక్తి Facebook కంపెనీలలోని ఇతర సర్వీసును కూడా ఉపయోగిస్తున్నారనే దానిని నిర్ధారించగలిగేలా పనిచేయవచ్చు. మా సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి మా సర్వీసుల గురించిన సమాచారాన్ని మరింత ఖచ్చితంగా రిపోర్ట్ చేయడానికి ఇది మమ్మల్ని అనుమతిస్తుంది. అంటే ఉదాహరణకు, Facebook కంపెనీలలోని ఇతర యాప్స్ లేదా సర్వీసులతో పోలిస్తే, వినియోగదారులు, WhatsApp సర్వీసులను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిని మేము అర్థం చేసుకోగలుగుతాము, తిరిగి ఇది సంభావ్య ఫీచర్లు లేదా ప్రోడక్ట్ మెరుగుదలలను అన్వేషించడానికి WhatsAppకు సహాయపడుతుంది. అంతేకాదు, WhatsAppకు ఎంతమంది ప్రత్యేక వినియోగదారులున్నారనే దానిని కూడా మేము లెక్కించగలుగుతాము. మా వినియోగదారులలో ఎవరు ఇతర Facebook యాప్స్ ఉపయోగించడం లేదు, అలాగే Facebook కంపెనీల అంతటా ఎంత మంది ప్రత్యేక వినియోగదారులు ఉన్నారనే దానిని తెలుసుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. మా సర్వీస్ యాక్టివిటీని మరింత కూలంకషంగా రిపోర్ట్ చేయడానికి ఇది పెట్టుబడిదారులు, నియంత్రణ సంస్థలతో పాటు WhatsAppకి సహాయపడుతుంది.
    • స్థిరమైన బిజినెస్‌ను నిర్మించడానికి మార్గాలను అన్వేషించేలా కూడా ఇది WhatsAppకు సహాయపడుతుంది. ఉదాహరణకు, మేము గతంలో ప్రకటించినట్లుగా, వ్యక్తులు, బిజినెస్‌లు WhatsAppను ఉపయోగించి సంభాషించుకోవడానికి మేము మార్గాలను అన్వేషిస్తున్నాము, ఇందులో ప్రజలు తమకు ఆసక్తి గల బిజినెస్‌లను కనుగొని WhatsApp ద్వారా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడేందుకు ఇతర Facebook కంపెనీలతో కలిసి పనిచేయడం కూడా ఉంది. ఈ విధంగా, Facebookలో తాము కనుగొన్న బిజినెస్‌లతో WhatsApp ద్వారా కమ్యూనికేషన్ నిర్వహించుకోవడాన్ని వినియోగదారులు మొదలుపెట్టడానికి Facebook సహాయపడుతుంది.
  • WhatsApp, అలాగే ఇతర Facebook కుటుంబ సర్వీసులను సురక్షితంగా, భద్రంగా ఉంచడం.
    • మేము ఇతర Facebook కంపెనీలతో గోప్యతా విధానంలోని "డేటాను ప్రోసెస్ చేయడం కోసం మా చట్టపరమైన ప్రాతిపదిక" విభాగం ప్రకారం, అలాగే మా సర్వీసుల్లో స్పామ్, దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడేందుకు, వాటిని సురక్షితంగా ఉంచేందుకు, మా సర్వీసుల లోపలా, వెలుపల రక్షణను, భద్రతను, సమగ్రతను మెరుగుపరచడంలో సహాయపడటానికి సమాచారాన్ని షేర్ చేసుకుంటాము. అంటే ఉదాహరణకు, తమ సేవలను ఒక వ్యక్తి చట్ట వ్యతిరేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని Facebook కంపెనీలకు చెందిన ఏ సభ్యలు అయినా కనుగొంటే, అది వారి అకౌంట్‌ను నిలిపివేయగలదు. ఇతర Facebook కంపెనీలు కూడా అలాగే చేయడాన్ని పరిశీలించడానికి ఆ విషయాన్ని వారికి తెలియజేయగలదు. ఈ విధంగా, ముందుగా మా సేవా నిబంధనలను ఉల్లంఘించినట్లు లేదా మా వినియోగదారులు లేదా ఇతరుల రక్షణ లేదా భద్రతకు హాని కలిగించినట్లుగా గుర్తించబడిన వినియోగదారులకు సంబంధించి, మా ఇతర కుటుంబ సంస్థల సభ్యులకు హెచ్చరిక పంపే ఉద్దేశం కోసం మాత్రమే మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము.
    • WhatsApp అలాగే ఇతర Facebook కంపెనీల సర్వీసులను సురక్షితంగా, భద్రంగా ఉండేలా చేయడానికి, Facebook కంపెనీలు అంతటా, ఏ అకౌంట్‌లు, ఒకే వినియోగదారుకు చెందినవనే దాని గురించి మేము అర్థం చేసుకోవలసి ఉంటుంది, తద్వారా ఎవరైనా వినియోగదారు మా సేవా నిబంధనలను ఉల్లంఘించారని మేము గుర్తించినప్పుడు, లేదా ఇతరుల రక్షణ లేదా భద్రతకు సంబంధించి బెదిరింపుగా మారినప్పుడు సముచితమైన చర్యను మేము తీసుకోగలము.
  • మేము Facebookలోని Facebook ప్రోడక్టులను మెరుగుపరచడం కోసం, అలాగే మరింత అనుగుణమైన Facebook యాడ్ అనుభవాలను అందించడం కోసం సమాచారాన్ని షేర్ చేయము.
    • ఈరోజు, Facebook ప్రోడక్ట్ అనుభవాలను మెరుగుపరచడానికి లేదా మరింత అనుగుణమైన Facebook అనుభవాలను Facebookలో అందించడానికి, Facebook మీ WhatsApp అకౌంట్ సమాచారాన్ని ఉపయోగించదు. ఐరిష్ డేటా సంరక్షణ కమిషన్ మరియు యూరోప్‌లోని ఇతర డేటా సంరక్షణ సంస్థలతో జరిపిన చర్చల ఫలితం ఇది. మీ WhatsApp వినియోగ అనుభవాన్ని, మీరు ఉపయోగించే ఇతర Facebook ప్రోడక్ట్‌లను మరింత మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము. మేము ఆ డేటాను Facebook కంపెనీలతో భవిష్యత్తులో ఈ ప్రయోజనం కోసం షేర్ చేయవచ్చు, అయితే, ఆ తరహా వినియోగ విధానంపై ఐరిష్ డేటా సంరక్షణ కమిషన్‌తో ఒక అవగాహనకు వచ్చినప్పుడే మేము ఆ విధంగా చేస్తాము. మేము అందించే కొత్త అనుభవాలు, అలాగే మా సమాచార ఆచరణలను మేము మీకు తెలియజేస్తాము.
ఈ ప్రయోజనాల కోసం ఎవరి WhatsApp సమాచారం Facebook కంపెనీలతో షేర్ చేయబడుతుంది?
మా సర్వీసులను ఉపయోగించాలని ఎంచుకున్న WhatsApp వినియోగదారులందరి కోసం మేము సమాచారాన్ని షేర్ చేస్తాము. Facebook కంపెనీల నుండి విలువైన సేవలను పొంది, మా గోప్యతా విధానంలో అలాగే ఈ కథనంలో పేర్కొన్న ముఖ్యమైన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇందులో Facebook వినియోగదారులు కానటువంటి WhatsApp వినియోగదారులు కూడా ఉండవచ్చు, ఎందుకంటే మా వినియోగదారులందరి సమాచారాన్ని, అవసరమైనప్పుడు షేర్ చేయగల సామర్థ్యం మాకు ఉండవలసిన అవసరం ఉంది.
అన్ని సందర్భాల్లో, ఈ ప్రయోజనాలను నెరవేర్చడానికి మేము ఈ సమాచారంలోని కొంత మొత్తాన్ని షేర్ చేస్తాము. మేము షేర్ చేసే సమాచారం తాజాగా ఉండేలా చూసుకుంటాము, కాబట్టి మీరు మీ WhatsApp ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయదలచుకుంటే, ఉదాహరణకు, మా నుండి ఆ నంబర్ వివరాలు అందుకున్న Facebook కుటుంబ సభ్యులు కూడా దానిని అప్‌డేట్ చేస్తారు.
ముఖ్యంగా తెలియ చెప్పేదేమిటంటే, మీ WhatsApp కాంటాక్టులను, Facebook లేదా ఏ ఇతర Facebook కంపెనీల సభ్యులతో, వాటి స్వప్రయోజనాల కోసం WhatsApp షేర్ చేయదు, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రణాళికలు మాకు లేవు.
నా WhatsApp సమాచారాన్ని Facebook కంపెనీలు ఉపయోగించుకునే విషయమై నాకు ఎటువంటి ఎంపికలున్నాయి?
మీరు యాప్-లోని నా అకౌంట్‌ని తొలగించు ఫీచర్ ద్వారా ఎల్లప్పుడూ మా సర్వీసులను ఉపయోగించడం నిలిపివేసి మీ అకౌంట్‌ని తొలగించుకోవచ్చు. మీ WhatsApp అకౌంట్‌ని తొలగించడం వలన ఇతర Facebook కంపెనీలు అందించే ఇతర యాప్‌లు, సర్వీసులను ఉపయోగించడాన్ని కొనసాగించే సామర్థ్యంపై ప్రభావం చూపదు, అంటే Facebook అకౌంట్‌ని తొలగించడం వలన WhatsAppను ఉపయోగించడం కొనసాగించే సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపదో అలా అన్నమాట. మీరు మీ WhatsApp అకౌంట్‌ని తొలగించినప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి మరింత సమాచారం కోసం దయచేసి WhatsApp గోప్యతా విధానాన్ని చూడండి.
Does this answer your question?
అవును
కాదు