మీ అకౌంట్‌ని తొలగించడం ఎలా

Android
iPhone
KaiOS
మీరు WhatsAppలో నుండే మీ అకౌంట్‌ని తొలగించవచ్చు. మీ అకౌంట్‌ని తొలగించడం అనేది ఇక పునరుద్ధరించుకునే అవకాశం లేని ప్రక్రియ, దానిని మీరు ప్రమాదవశాత్తు చేసినా సరే మీ అకౌంట్‌ని తిరిగి పొందే అవకాశం ఉండదు.
మీ అకౌంట్‌ని తొలగించడానికి
 1. ఆప్షన్లు > సెట్టింగ్‌లు > ఖాతా > నా అకౌంట్‌ని తొలగించును నొక్కండి.
 2. మీ దేశపు కోడ్ ఎంచుకుని, మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి.
 3. తొలగించు > తొలగించును నొక్కండి.
మీ అకౌంట్‌ని తొలగించడం వలన ఇవి జరుగుతాయి:
 • మీ అకౌంట్ WhatsApp నుండి తొలగించబడుతుంది.
 • మీ ఫోన్‌లో మీ చాట్ హిస్టరీ తొలగించబడుతుంది.
 • మీ అన్ని WhatsApp గ్రూపుల నుండి మీరు తొలగించబడతారు.
మీరు మీ అకౌంట్‌ని తొలగిస్తే:
 • మీరు మీ అకౌంట్‌ని తిరిగి పొందలేరు.
 • మీ WhatsApp సమాచారాన్ని తొలగించడానికి, తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన రోజు నుండి 90 రోజుల వరకూ సమయం పట్టవచ్చు. ఏదయినా విపత్తు, సాఫ్ట్‌వేర్ ఎర్రర్, లేదా ఇతర డేటా నష్టం లాంటివి జరిగినప్పుడు తిరిగి పొందడానికి మేము ఉపయోగించే బ్యాకప్ స్టోరేజ్‌లో మీ సమాచార కాపీలు 90 రోజుల తర్వాత కూడా అలాగే ఉండవచ్చు. ఈ సమయంలో WhatsAppలో మీకు మీ సమాచారం లభించదు.
 • మీరు సృష్టించిన గ్రూపులకు సంబంధించి మీ సమాచారం లేదా మీకు సంబంధించి ఇతర వినియోగదారులు కలిగి ఉన్న సమాచారాన్ని ఇది ప్రభావితం చేయదు, ఉదాహరణకు, మీరు ఇతర వినియోగదారులకు పంపిన మెసేజ్‌ల యొక్క కాపీల వంటివి.
 • లాగ్ రికార్డ్‌ల వంటి కొన్ని మెటీరియల్స్‌కు సంబంధించిన కాపీలు మా డేటాబేస్‌లో అలాగే ఉండవచ్చు, కానీ అవి వ్యక్తిగత గుర్తింపు నుండి విడదీయబడి ఉంటాయి.
 • చట్టపరమైన సమస్యలు, నిబంధనల ఉల్లంఘనలు, లేదా హాని తలపెట్టే ప్రయత్నాలను నిరోధించే చర్యల కోసం కూడా మేము మీ సమాచారాన్ని ఉంచుకోవచ్చు.
 • మరింత సమాచారం కోసం దయచేసి మా గోప్యతా విధానంలోని చట్టం మరియు సంరక్షణ విభాగాన్ని చూడండి.
 • ఇతర Facebook కంపెనీలతో షేర్ చేసిన మీ సమాచారం కూడా తొలగించబడుతుంది.
సంబంధిత రిసోర్స్‌లు:
వీటిలో మీ అకౌంట్‌ని తొలగించడం ఎలాగో తెలుసుకోండి: Android | iPhone
Does this answer your question?
అవును
కాదు