అమల్లోకి వచ్చే తేదీ సమాచారం

అమలు తేదీన ఏమవుతుంది?
ఈ అప్‌డేట్ కారణంగా మే 15వ తేదీన ఎవ్వరి అకౌంట్‌లు తొలగించబడటం లేదా WhatsApp ఫంక్షనాలిటీని కోల్పోవడం జరగదు.
అమలు తేదీ తర్వాత ఏమవుతుంది?
సదరు అప్‌డేట్‌ను చూసి అంగీకరించిన మెజారిటీ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుని, అప్‌డేట్‌ను సమీక్షించి అంగీకరించే అవకాశం రాని వారు, ఆ ప్రక్రియను పూర్తి చేసేలా గుర్తు చేస్తూ దాని గురించి మరింత సమాచారాన్ని అందించే ఒక నోటిఫికేషన్‌ను మేము WhatsAppలో చూపడాన్ని కొనసాగిస్తాము. ఈ రిమైండర్లు నిరంతరం ఉండేలా చేయడానికి, యాప్ కార్యాచరణను పరిమితం చేయడానికి సంబంధించి మా వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవు.
ఈ అప్‌డేట్‌లను అంగీకరించని వారు నేరుగా ఈ యాప్‌లోనే వాటిని అంగీకరించేలా చేయడం కోసం కూడా ఇతర అవకాశాలున్నాయి. ఉదాహరణకు, ఒకరు WhatsApp కోసం తిరిగి రిజిస్టర్ చేసుకున్నప్పుడు లేదా ఈ అప్‌డేట్‌కు సంబంధించిన ఫీచర్‌ను తొలిసారిగా ఉపయోగించాలనుకున్నప్పుడు.
మీరు మీ చాట్ హిస్టరీని Android లేదా iPhone పై ఎగుమతి చేసుకోవచ్చు, అలాగే మీ అకౌంట్ యొక్క నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మీరు మీ అంతట మీ చాట్‌లను ఎగుమతి చేసుకోవచ్చు లేదా మీ అకౌంట్ నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవడంలో లేదా మీ అకౌంట్‌ను తొలగించడంలో మీకు సహాయం అవసరమైతే, మీరు మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
మీరు అప్‌డేట్‌ను అంగీకరించకపోతే WhatsApp మీ అకౌంట్‌ను తొలగించదు.
  • ఇన్‌యాక్టివ్ వినియోగదారులకు సంబంధించి మా ప్రస్తుత పాలసీ వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
  • మీరు Android, iPhone, లేదా KaiOSలో మీ అకౌంట్‌ను తొలగించాలనుకుంటే, మరోసారి పరిశీలిస్తారని మేము ఆశిస్తున్నాం. మీ అకౌంట్‌ను తొలగించడం వల్ల మీ మెసేజ్ హిస్టరీ తీసివేయబడుతుంది, మీ WhatsApp గ్రూప్‌లన్నిటి నుండి మీరు తీసివేయబడతారు, మీ WhatsApp బ్యాకప్‌లను తొలగిస్తుంది, వీటిని తిరిగి పొందే అవకాశం ఉండదు.
Does this answer your question?
అవును
కాదు