కాంటాక్ట్ అప్‌లోడ్ చేయడం గురించి

కాంటాక్ట్ అప్‌లోడ్ అనేది ఒక ఆప్షనల్ ఫీచర్, అది మీ డివైజ్‌లోని అడ్రస్ బుక్‌లో గల కాంటాక్టుల్లో ఎవరెవరు WhatsApp వినియోగదారులనే దానిని మేము గుర్తించగలిగేలా చేసి, వారిని మీ WhatsApp కాంటాక్టులకు జోడించేలా సహాయపడుతుంది, తద్వారా WhatsAppను ఇంకా ఉపయోగించని మీ కాంటాక్టులెవరైనా తర్వాత సైనప్ చేసినప్పుడు మీ WhatsApp కాంటాక్టులను త్వరితంగా అప్‌డేట్ చేయగలుగుతాము. WhatsApp మీ కాంటాక్టులను Facebookతో షేర్ చేయదనేది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. మీ డివైజ్‌లోని మీ WhatsApp వెర్షన్, మీ WhatsApp కాంటాక్టుల పేర్లను మీ డివైజ్‌లోని అడ్రస్ బుక్ నుండి చూపుతుంది, కాబట్టి మీరు వారితో త్వరగా కనెక్ట్ అవ్వవచ్చు.
మీరు కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచర్ ఉపయోగించి మీ డివైజ్‌లోని అడ్రస్ బుక్‌ను యాక్సెస్ చేయడానికి WhatsAppకు అనుమతినిచ్చినప్పుడు, WhatsApp మీ అడ్రస్ బుక్‌లోని ఫోన్ నంబర్లను WhatsApp వినియోగదారులు మరియు ఇతర కాంటాక్టులతో పాటు యాక్సెస్ చేసి క్రమ విధానంలో అప్‌లోడ్ చేస్తుంది, మీ కాంటాక్టుల్లో ఎవరైనా ఇప్పటికీ WhatsAppను ఉపయోగించకుండా ఉంటే, మేము వినియోగదారులు కానటువంటి కాంటాక్టులు గుర్తించడం సాధ్యపడని విధానంలో మీ కోసం ఈ సమాచారాన్ని నిర్వహిస్తాము. మేము ఈ ఫోన్ నంబర్లను స్టోర్ చేయము, వాటిని కేవలం కొద్ది సమయం పాటు క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ విలువలను సృష్టించేందుకు మాత్రమే ప్రోసెస్ చేస్తాము, ఇవి ఈ కాంటాక్టులు WhatsAppలో చేరితే అత్యంత వేగంగా వారితో మీరు కనెక్ట్ అయ్యేలా ప్రారంభించడానికి మాకు సహాయపడతాయి. మీ డివైజ్ ఆధారిత సెట్టింగ్‌ల నుండే ఈ కాంటాక్ట్ అప్‌లోడ్ ఫీచరును నియంత్రించవచ్చు.
ఇది మీ ప్రశ్నకు సమాధానం ఇస్తుందా?
అవును
కాదు