How to block and report contacts

Android
iPhone
KaiOS
నిర్దిష్ట కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం ద్వారా, మీరు వాటి నుండి మెసేజ్‌లను, కాల్స్‌ను, స్టేటస్ అప్‌డేట్‌లను అందుకోవడాన్ని నిలిపివేయవచ్చు. వారు సమస్యాత్మకమైన కంటెంట్ లేదా స్పామ్‌ను పంపిస్తున్నారని మీరు భావిస్తే, వారి గురించి మీరు రిపోర్ట్ కూడా చేయవచ్చు.
మీరు లేదా వేరే ఎవరైనా తక్షణ ప్రమాదంలో ఉన్నారని మీరు భావిస్తే, దయచేసి మీ స్థానిక అత్యవసర సేవల విభాగాన్ని సంప్రదించండి.
కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడం
  1. WhatsAppను తెరవండి, మరిన్ని ఆప్షన్‌లు
    > సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.
  2. గోప్యత > బ్లాక్ చేసిన కాంటాక్ట్స్‌ను ట్యాప్ చేయండి.
  3. యాడ్ చేయండి
    ని ట్యాప్ చేయండి.
  4. మీరు బ్లాక్ చేయాలనుకునే కాంటాక్ట్ కోసం వెతకండి లేదా ఎంచుకోండి.
గమనిక:
  • మీరు మీ ఫోన్ నంబర్ మార్చి, అదే WhatsApp అకౌంట్‌ను ఉపయోగిస్తే, మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్స్, బ్లాక్ చేయబడే ఉంటాయి. ఫోన్ నంబర్ మార్చండి ఫీచర్‌ను ఉపయోగించడం ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
    • మీరు కొత్త WhatsApp అకౌంట్‌ను సెటప్ చేస్తే, మీరు ఆ కాంటాక్ట్‌లను మాన్యువల్‌గా మళ్లీ బ్లాక్ చేయవలసి ఉంటుంది.
కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడానికి మరిన్ని మార్గాలు:
  • కాంటాక్ట్‌తో చాట్‌ను తెరవండి, తర్వాత మరిన్ని > బ్లాక్ చేయండి > బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి. అలాగే మీరు సదరు కాంటాక్ట్‌ను కాంటాక్ట్ గురించి రిపోర్ట్ చేయండి > బ్లాక్ చేయండిని ట్యాప్ చేసి కూడా రిపోర్ట్ చేయవచ్చు.
  • సదరు కాంటాక్ట్‌తో చాట్‌ను తెరవండి, తర్వాత కాంటాక్ట్ పేరును ట్యాప్ చేయండి > బ్లాక్ చేయండి > బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి.
తెలియని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడం
  1. ఆ తెలియని ఫోన్ నంబర్‌తో WhatsApp చాట్‌ను తెరవండి.
  2. బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి. అలాగే మీరు సదరు కాంటాక్ట్‌ను కాంటాక్ట్ గురించి రిపోర్ట్ చేయండి > బ్లాక్ చేయండిని ట్యాప్ చేసి కూడా రిపోర్ట్ చేయవచ్చు..
గమనిక:
  • బ్లాక్ చేయబడిన కాంటాక్ట్‌లు మీకు ఇకపై కాల్ చేయలేరు లేదా మెసేజ్‌లు పంపలేరు.
  • మీరు చివరిగా కనిపించినది, ఆన్‌లైన్‌లో ఉన్నది, స్టేటస్ అప్‌డేట్స్, అలాగే మీ ప్రొఫైల్ ఫోటోకు చేసిన ఏమయినా మార్పులనేవి, మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్‌లకు కనిపించవు.
  • కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడం వల్ల, వారు మీ కాంటాక్ట్స్ లిస్ట్ నుండి తీసివేయబడరు, లేదా సదరు కాంటాక్ట్ యొక్క ఫోన్‌లోని లిస్ట్ నుండి మీరు తీసివేయబడరు. ఒక కాంటాక్ట్‌ను తొలగించాలంటే, మీరు సదరు కాంటాక్ట్‌ను మీ ఫోన్ అడ్రస్ బుక్ నుండి తప్పక తొలగించవలసి ఉంటుంది.
  • మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్‌కు, మీరు వారిని బ్లాక్ చేసారని తెలిస్తే ఏమవుతుందనే ఆందోళన మీకు ఉంటే, దయచేసి ఈ కథనాన్ని చదవండి.
కాంటాక్ట్‌ను అన్‌బ్లాక్ చేయడం
  1. WhatsAppలో, మరిన్ని ఆప్షన్‌లు
    > సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  2. గోప్యత > బ్లాక్ చేసిన కాంటాక్ట్స్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు అన్‌బ్లాక్ చేయాలనుకునే కాంటాక్ట్‌పై ట్యాప్ చేయండి.
  4. {contact}ను అన్‌బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి. మీరూ, సదరు కాంటాక్ట్, ఇకపై నుండి మెసేజ్‌లను పంపుకోవడం, అందుకోవడం, కాల్స్ చేసుకోవడం, స్టేటస్ అప్‌డేట్‌లను పంపుకోవడం చేయగలరు.
ఒక కాంటాక్ట్‌ను అన్‌బ్లాక్ చేయడానికి మరిన్ని మార్గాలు.
  • మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్ కోసం వెతకండి > కాంటాక్ట్ పేరును ట్యాప్ చేసి పట్టుకోండి > {contact}ను అన్‌బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి.
  • మీ కాంటాక్ట్ నుండి చివరి చాట్‌ను తెరవండి, అపై కిందక్ స్క్రోల్ చేయండి. "మీరు ఈ కాంటాక్ట్‌ను బ్లాక్ చేసారు"ను ట్యాప్ చేయండి. అన్‌బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి.
గమనిక:
  • మీరు ఒక కాంటాక్ట్‌ను అన్‌బ్లాక్ చేస్తే, సదరు కాంటాక్ట్ అంతకు ముందు బ్లాక్ చేయబడిన సమయంలో, వారు మీకు పంపిన ఏమయినా మెసేజ్‌లు, కాల్స్, లేదా స్టేటస్ అప్‌డేట్స్‌ను మీరు అందుకోరు.
  • గతంలో మీ ఫోన్ అడ్రస్ బుక్‌లో సేవ్ అవ్వని కాంటాక్ట్‌ను లేదా ఫోన్ నంబర్‌ను మీరు అన్‌బ్లాక్ చేస్తే, మీరు ఆ కాంటాక్ట్‌ను లేదా ఫోన్ నంబర్‌ను మీ డివైజ్‌కు పునరుద్ధరించలేరు.
ఒక కాంటాక్ట్ గురించి రిపోర్ట్ చేయడం
  1. మీరు రిపోర్ట్ చేయాలనుకునే కాంటాక్ట్‌తో చాట్‌ను తెరవండి.
  2. మరిన్ని ఆప్షన్‌లు
    > మరిన్ని > రిపోర్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
    • సదరు వినియోగదారుని మీరు బ్లాక్ చేసి, చాట్‌లోని మెసేజ్‌లను కూడా తొలగించాలనుకుంటే, బాక్స్‌ను టిక్ చేయండి.
  3. రిపోర్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
గమనిక: రిపోర్ట్ చేయబడిన వినియోగదారు, లేదా గ్రూప్ నుండి మీకు పంపబడిన చివరి ఐదు మెసేజ్‌లను WhatsApp అందుకుంటుంది, వారికి ఈ విషయం తెలియచేయబడదు. మెసేజ్ పంపబడిన సమయం, మెసేజ్ రకం (ఇమేజ్, వీడియో, టెక్స్ట్, లాంటి) రిపోర్ట్ చేయబడిన గ్రూప్ లేదా వినియోగదారు ID సమాచారాన్ని కూడా WhatsApp అందుకుంటుంది.
ఒక మెసేజ్‌పై ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా కూడా మీరు ఓ అకౌంట్ గురించి రిపోర్ట్ చేయవచ్చు.
  1. మెనూను తెరవడం కోసం ఒక వ్యక్తి కాంటాక్ట్ పేరును ఎక్కువ సేపు నొక్కి ఉంచి, తర్వాత వదలండి.
  2. మెనూ దిగువ భాగానికి స్క్రోల్ చేయండి. {contact name}ను బ్లాక్ చేయండిని ట్యాప్ చేయండి.
ఒకసారి చూసే ఫోటో లేదా వీడియోను రిపోర్ట్ చేయండి
  1. ఒకసారి చూసే ఫోటో లేదా వీడియోను తెరవండి.
  2. మరిన్ని ఆప్షన్‌లు
    > కాంటాక్ట్‌ను రిపోర్ట్ చేయండినిt ట్యాప్ చేయండి.
ఒకసారి చూసే ఫీచర్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.
ఇది మీ ప్రశ్నకు సమాధానం ఇస్తుందా?
అవును
కాదు